TTD23rd Dec 12:17 PMSunil Byrisetty1 min read
50 కిలోల బంగారం గోవిందా!
పవిత్ర తిరుమల దేవస్థానంలో అక్రమాలు ఒకటొకటిగా వెలుగులోకి వస్తున్నాయి. పరకామణి, కల్తీ నెయ్యి, పట్టు శాలువా కేసులు ఇప్పటికే కలకలం రేపిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో కొండపైనే కాదు..
పవిత్ర తిరుమల దేవస్థానంలో అక్రమాలు ఒకటొకటిగా వెలుగులోకి వస్తున్నాయి. పరకామణి, కల్తీ నెయ్యి, పట్టు శాలువా కేసులు ఇప్పటికే కలకలం రేపిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో కొండపైనే కాదు.. కొండ కిందా అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఒక వైపు తిరుమలలో పరకామణిలో చోరీ, కల్తీ నెయ్యి, వస్త్రాల కొనుగోళ్లలో అవినీతి అంశాలపై విచారణ జరుగుతుండగా.. తాజాగా తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి వారి విమాన గోపురం పనుల్లో 50 కిలోల బంగారం మాయమైందనే ఆరోపణలపై విజిలెన్స్ విభాగం లోతుగా విచారణ జరుపుతోంది. 30 విగ్రహాలు ధ్వంసమైన విషయం కూడా తెరపైకి వచ్చింది.