News18th Nov 03:24 PMSunil Byrisetty1 min read
ఆర్థిక రాజధానిలో 50 అంతస్తుల ‘ఐకానిక్ టవర్
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో 50 అంతస్తుల ఐకానిక్ టవర్ నిర్మాణం కానుంది. విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ భారీ అభివృద్ధి ప్రాజెక్టులు ప్లాన్ చేస్తోంది. న
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని
విశాఖపట్నంలో 50 అంతస్తుల ఐకానిక్ టవర్ నిర్మాణం కానుంది. విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ భారీ అభివృద్ధి ప్రాజెక్టులు ప్లాన్ చేస్తోంది. నగరాన్ని అంతర్జాతీయ స్థాయి బే సిటీగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. కైలాసగిరిలో 87 ఎకరాల్లో 50 అంతస్తుల ‘ఐకానిక్ టవర్’ నిర్మాణాన్ని ప్రకటించింది. అలాగే కొత్తవలసలో 120 ఎకరాల థీమ్ ఆధారిత టౌన్‌షిప్‌ను కూడా అభివృద్ధి చేయనుంది. మంత్రి నారాయణ ఆదేశాల మేరకు ఈ ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయి.
కైలాసగిరి పర్వతపు దిగువ భాగంలో భారీగా జరుగనున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 87 ఎకరాల్లో 50 అంతస్తుల ఐకానిక్ టవర్ నిర్మాణం ప్రధాన ఆకర్షణగా మారనుంది. ఈ టవర్ టూరిజం, రియల్‌ఎస్టేట్ మరియు కమర్షియల్ అవకాశాలను పెంచడానికి రూపొందించబడింది.