Jobs25th Oct 03:12 PMSunil Byrisetty1 min read

ఉద్యోగ మేళాలో 51 మంది ఎంపిక

రామచంద్రపురం నియోజకవర్గంలో నిరుద్యోగ నిర్మూలనకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విశేష కృషి చేస్తున్నారు. వారం వారం జాబ్ మేళా కార్యక్రమంలో భాగంగా రామచంద్రపురంలోని ఉపాధి

ఉద్యోగ మేళాలో 51 మంది ఎంపిక
రామచంద్రపురం నియోజకవర్గంలో నిరుద్యోగ నిర్మూలనకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విశేష కృషి చేస్తున్నారు. వారం వారం జాబ్ మేళా కార్యక్రమంలో భాగంగా రామచంద్రపురంలోని ఉపాధి కార్యాలయంలో శనివారం జరిగిన ఉద్యోగ మేళాలో వివిధ కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యూలలో మొత్తం 51 మంది ఎంపికయ్యారు. టాటా ఎలక్ట్రానిక్స్ 07 , భారత్ బయో టెక్ 09 , బయో ఫార్మా 02 , స్చెఇండ్లేర్ ఎలక్ట్రిక్ 01 , మహీంద్రా మ్యానుఫ్యాక్చరింగ్ 32 వెరసి మొత్తం 51 మంది ఎంపికయ్యారు. ఎంపికైన వారందరూ హైదరాబాద్ లో విధులు నిర్వహిస్తారని కంపెనీల ప్రతినిధులు, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం, ఉపాధి ప్రాజెక్ట్ డైరెక్టర్ రామ్ కుమార్ తెలిపారు. జాబ్ మేళాలు ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పన ధ్యేయంగా కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీల ప్రతినిధులు, తదితరులు హాజరై ఉద్యోగానికి ఎన్నికైన వారికి అభినందనలు తెలియజేశారు. ఉద్యోగం పొందిన 51 మంది మంత్రి వాసంశెట్టి సుభాష్ , సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్, ఉపాధి బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
Ramachandrapuram
Job Fair
Employment
Tata Electronics
Bharat Biotech
Bio Pharma
Schneider Electric
Mahindra Manufacturing
మహీంద్రా మ్యాన్యుఫ్యాక్చరింగ్
నిరుద్యోగ నిర్మూలన
నైపుణ్య అభివృద్ధి
Scroll for the next article