News24th Dec 03:48 PMSunil Byrisetty1 min read
24 గంటల్లో పాస్టర్లకు రూ.51 కోట్లు విడుదల
క్రైస్తవుల సంక్షేమం అభివృద్ధి కోసం టీడీపీ ప్రభుత్వం పనిచేస్తుందని.. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8427 మంది పాస్టర్లకు రూ.51 కోట్లు విడుదల చేసినట్టు ఎమ్మెల్యే బూర్ల రామాం
క్రైస్తవుల సంక్షేమం అభివృద్ధి కోసం టీడీపీ ప్రభుత్వం పనిచేస్తుందని.. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8427 మంది పాస్టర్లకు రూ.51 కోట్లు విడుదల చేసినట్టు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో.. క్రిస్మస్ పండగ సందర్భంగా క్రైస్తవ సోదరీ సోదరీమణులందరికీ తెలుగుదేశం పార్టీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు క్రైస్తవ సోదరులందరి కుటుంబాల్లో ఎంతో ఆనందదాయకమైన వేడుకలు మనం చూస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రధాని మోదీ ఆశీస్సులతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ లు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారని గుర్తు చేశారు. క్రైస్తవులు ప్రభుత్వ పథకాలతో ఎంతో ఆనందంగా ఉన్నారని తెలిపారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, దీపం పథకం, ఉచిత బస్సు పథకంతో క్రైస్తవ సోదరులు కూడా ఎక్కువ ప్రయోజనం పొందారని గుర్తు చేశారు. అలాగే చర్చీల నిర్మాణానికి, మరమ్మతులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తోందని ఆయన పేర్కొన్నారు.