Jobs18th Sep 03:37 PMSunil Byrisetty1 min read

రూ.526.25 కోట్ల పెట్టుబడులతో 8,896 ఉద్యోగాలు

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశం సచివాలయంలో జరిగింది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ, కృషితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర

రూ.526.25 కోట్ల పెట్టుబడులతో 8,896 ఉద్యోగాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశం సచివాలయంలో జరిగింది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ, కృషితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ ఎత్తున దిగ్గజ ఐటీ మరియు ఫ్యూచర్ టెక్నాలజీ కంపెనీలు తరలివస్తున్నాయి. నేడు జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశంలో రాష్ట్రంలో ఐటీ, క్వాంటం రంగాన్ని మరింత విస్తరించడమే లక్ష్యంగా కీలక ప్రాజెక్టులకు ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో, ముఖ్యంగా విశాఖపట్నం, అమరావతి, కడప జిల్లాల్లో భారీగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. విశాఖపట్నంలో రూ.100 కోట్ల పెట్టుబడితో "ఇంటిగ్రేటెడ్ హబ్ ఏఐ & టెక్ ట్రైనింగ్ సెంటర్" ఏర్పాటుకు ఆమోదం లభించింది. దీనిద్వారా 2,400 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కడప జిల్లాలో రూ.70 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుకానున్న యూనిట్‌కు సంబంధించి ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ 2021-24 కింద అర్హమైన ప్రోత్సాహకాల దరఖాస్తు గడువు పొడిగింపునకు ఆమోదం లభించింది. 300 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.
Scroll for the next article