News22nd Dec 04:03 PMSunil Byrisetty1 min read

సచివాలయంలో 56వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం

సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 56వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ భవనాల టెండర్లను పిలిచే అంశంపై అథారిటీ సమావేశంలో చర్చించారు. రాజ

సచివాలయంలో 56వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం
సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 56వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ భవనాల టెండర్లను పిలిచే అంశంపై అథారిటీ సమావేశంలో చర్చించారు. రాజధానిలో అఖిలభారత సర్వీసు అధికారుల నివాసాలు, న్యాయమూర్తుల నివాసాల వద్ద అదనపు నిర్మాణాలపైనా సమీక్షిస్తున్నారు. ఏపీసీఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పాలనా వ్యయం మంజూరుపై సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో సమీక్ష నిర్వహించారు. రాజధానిలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖకు చెందిన యోగా, నేచురోపతి సెంటర్ నిర్మాణంతో పాటు పలు భూ కేటాయింపులకు సంబంధించి మంత్రుల ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలపై చర్చించారు. జరీబు- మెట్ట భూముల వర్గీకరణపై రాష్ట్ర స్థాయి కమిటీని నియమించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. సీఆర్డీఏ అథారిటీ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి నారాయణ, సీఎస్ విజయానంద్, సీఆర్డీఏ, ఏడీసీఎల్ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Andhra Pradesh Secretariat
CRDA Authority meeting
Amaravati
Chief Minister Chandrababu Naidu
Quantum Computing Centre
Amaravati development
CRDA
ADCL
ఏడీసీఎల్
ఐఏఎస్ అధికారుల నివాసాలు
న్యాయమూర్తుల నివాసాలు
Scroll for the next article