Health1st Aug 05:21 PMSunil Byrisetty1 min read

ప్రాణం కోసం 5,839 మంది ఎదురుచూపు!

రాష్ట్రంలో అవయవ మార్పిడి కోసం వేలాది మంది ప్రాణాలతో పోరాడుతున్నారు. జీవన్‌దాన్‌ తాజా గణాంకాల ప్రకారం 2026 జూలై 1 నాటికి మొత్తం 5,839 మంది వివిధ అవయవాల కోసం వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్

ప్రాణం కోసం 5,839 మంది ఎదురుచూపు!
రాష్ట్రంలో అవయవ మార్పిడి కోసం వేలాది మంది ప్రాణాలతో పోరాడుతున్నారు. జీవన్‌దాన్‌ తాజా గణాంకాల ప్రకారం 2026 జూలై 1 నాటికి మొత్తం 5,839 మంది వివిధ అవయవాల కోసం వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్నారు. వీరిలో అత్యధికంగా మూత్రపిండాలు, కాలేయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వారికి బ్రెయిన్ డెడ్ (మెదడు మరణం) చెందిన వ్యక్తుల కుటుంబాలు తీసుకునే అవయవదాన నిర్ణయమే కొత్త జీవితం ప్రసాదిస్తోంది. రాష్ట్రంలో బ్రెయిన్ డెడ్ దాతల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతుండటంతో అవయవ మార్పిడి సేవలు కూడా విస్తరిస్తున్నాయి. గత ఏడాది 93 మంది బ్రెయిన్ డెడ్ దాతల ద్వారా ఏకంగా 301 అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగి జీవన్‌దాన్‌ చరిత్రలో కొత్త మైలురాయిగా నిలిచాయి. వైజాగ్ లో అవయవ దానంపై జీవన్ దాన్ ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర స్థాయి కార్యక్రమం జరగనుoది.
Ap health
Visakhapatnam
Jeevandan
Organ Donation
Organ Transplant
Brain Dead Donor
Kidney Transplant
Liver Transplant
Life Saving
Medical Services
Organ Donation Awareness
Transplant Surgery
Scroll for the next article