News13th Sep 05:37 PMSunil Byrisetty1 min read
6 లక్షల దోమతెరలు పంపిణీ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగష్టు నెలాఖరుకు 7,895 మలేరియా కేసులు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే సమయానికి 6,172 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ ఏడాది కేసులు 27.9 శాతం పెరిగాయి. అల్లూరి సీతారామరాజ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగష్టు నెలాఖరుకు 7,895 మలేరియా కేసులు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే సమయానికి 6,172 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ ఏడాది కేసులు 27.9 శాతం పెరిగాయి. అల్లూరి సీతారామరాజు, పోలవరం, విజయనగరం ప్రాంతాల్లో మలేరియా కేసులు కాస్త పెరిగాయి. ఈ ప్రాంతాల్లో దోమల నివారణ, దోమల పిల్లలను తొలగించడం, జ్వరాలతో బాధపడుతున్న వారిని గుర్తించి పరీక్షలు చేయడం వంటి చర్యలను పెంచుతున్నారు.
ఇళ్లలో మందు పిచికారీ చేయడంతో పాటు అవసరమైన చోట దోమతెరలను పంపిణీ చేస్తున్నారు. అవసరమైన వారికి 5,99,367 దోమతెరల పంపిణీ చర్యలు మొదలయ్యాయి. మరోవైపు రాష్ట్రంలో 1,475 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే సమయానికి 1,410 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది కేసులు 4.6 శాతం పెరిగాయి.