News21st Jun 03:59 PMSunil Byrisetty1 min read

61,266 పాఠశాలల్లో ఘనంగా యోగాంధ్ర

అంతర్జాతీయ యోగాదినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 61,266 ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అ

61,266 పాఠశాలల్లో ఘనంగా యోగాంధ్ర
అంతర్జాతీయ యోగాదినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 61,266 ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని, యోగాసనాలు వేసి రికార్డును నెలకొల్పడంలో భాగమయ్యారని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు తెలిపారు. 61,266 పాఠశాలల్లో దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. విశాఖపట్నం గీతం యూనివర్శిటీ క్రీడా మైదానంలో పాఠశాల విద్యాశాఖకు కేటాయించిన యోగాంధ్ర కార్యక్రమంలో శ్రీనివాసరావు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు డా. కె.వి.శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వహణకు అమూల్యమైన మద్దతు అందించిన నోడల్ అధికారులు, హెచ్‌ఓడీలు, ఆర్‌జేడీలు, డీఈఓలు, ఏపీసీలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Andhra Pradesh news
visakhapatnam
61
266 government private schools
Geetam University school
Dr. K.V. Srinivasulu Reddy
పాఠశాలల్లో ఘనంగా యోగాంధ్ర
Scroll for the next article