News26th Jul 03:00 PMSunil Byrisetty1 min read

రోడ్లు, తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి

మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో రోడ్లు, త్రాగునీటి సమస్యల పరిష్కారానికి ఢిల్లీ స్థాయిలో కృషి చేస్తున్నామని ఎంపీ వల్లభనేని బాలసౌరి అన్నారు. ప్రజల త్రాగునీటి సమస్యల శాశ్వత పరిష్కారానిక

రోడ్లు, తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి
మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో రోడ్లు, త్రాగునీటి సమస్యల పరిష్కారానికి ఢిల్లీ స్థాయిలో కృషి చేస్తున్నామని ఎంపీ వల్లభనేని బాలసౌరి అన్నారు. ప్రజల త్రాగునీటి సమస్యల శాశ్వత పరిష్కారానికి 6వేల కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలను ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ వెల్లడించారు. గుడ్లవల్లేరు మండలంలోని అంగలూరు గ్రామంలో ఎంపీ వల్లభనేని బాలసౌరి, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శనివారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో రూ.32 లక్షల N.H.P.C సంస్థ సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ ను ఎమ్మెల్యే రాముతో కలిసి, ఎంపీ బాలసౌరి ప్రారంభించారు. ప్రజలు తెలిపిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎంపీ బాలసౌరి, ఎమ్మెల్యే రాము హామీ ఇచ్చారు.
Andhra Pradesh news
Machilipatnam
Vallabhaneni Balashouri
Drinking Water Project
Road Development
రోడ్లు
తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి
Scroll for the next article