News12th Nov 05:05 PMSunil Byrisetty1 min read
రూ.632 కోట్లతో ఎత్తిపోతల పథకాల మరమ్మతులు
గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా రాష్ట్రంలో నిర్వీర్యమైన ఎత్తిపోతల పథకాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించి జూన్ నాటికి వాటి ద్వారా నీరు విడుదల చేసేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత
గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా రాష్ట్రంలో నిర్వీర్యమైన ఎత్తిపోతల పథకాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించి జూన్ నాటికి వాటి ద్వారా నీరు విడుదల చేసేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఖరీఫ్‌కు పునరుద్ధరణ పరిధిలో ఉన్న 789 ఎత్తిపోతల పథకాల మరమ్మతులన్నీ ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో వాటి స్థితిగతులను పరిశీలించి, వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణ, నిర్వహణ, ఇరిగేషన్ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంప్ కార్యాలయంలో సమీక్షించారు. రాష్ట్రంలో 789 ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణకు రూ.632.07 కోట్లు అవసరమవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వీటి పునరుద్ధరణ ద్వారా 7.49 లక్షల ఎకరాలకు సమృద్ధిగా సాగునీటి సదుపాయం కల్పించవచ్చని తెలిపారు. ఇక ఎత్తిపోతల పథకాల నిర్వహణకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.