News22nd Oct 05:13 PMSunil Byrisetty1 min read
రూ.6,500 కోట్లతో ఒకేసారి 52,000 పనులు
గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోంది. అందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పల్లె పండుగ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గతేడాది ఇదే సమ
గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోంది. అందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పల్లె పండుగ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గతేడాది ఇదే సమయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి.. దాదాపు రూ. 4500 కోట్ల వ్యయంతో, 30 వేల పనులను మొదలుపెట్టారు. ఈ ఏడాది కూడా ఈ పల్లె పండుగను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో రూ.6,500 కోట్లతో 52,000 పనులు ఒకేసారి చేపట్టేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తద్వారా పల్లెల్లో పండుగ వాతావరణం తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. పల్లె పండుగ 2.0 కింద చేపట్టే పనులను అక్టోబర్ నెలాఖరులోగా లేదా నవంబర్ మొదటివారంలో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఇటీవల ఓ సమీక్ష సమావేశంలో అధికారులకు ఆదేశించినట్లు సమాచారం.