News23rd Sep 12:10 PMSunil Byrisetty1 min read

అర్హులందరికీ తల్లికి వందనం

రాష్ట్రంలో తల్లికి వందనం పథకం కింద 66,57,508 మంది విద్యార్థులకు సాయం అందించినట్లు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం కింద లబ్ధిపొందిన వి

అర్హులందరికీ తల్లికి వందనం
రాష్ట్రంలో తల్లికి వందనం పథకం కింద 66,57,508 మంది విద్యార్థులకు సాయం అందించినట్లు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం కింద లబ్ధిపొందిన విద్యార్థుల వివరాలపై శాసనమండలిలో యల్లారెడ్డిగారి శివరామిరెడ్డి, రాజగొల్ల రమేష్ యాదవ్, బొమ్మి ఇజ్రాయేల్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, పరిశుభ్రత, పాఠశాల నిర్వహణ, విద్య, పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కు విద్యార్థుల నుంచి తగ్గించిన రూ.2వేలను వినియోగిస్తున్నాం. వైసీపీ సభ్యులు అమ్మఒడి అని మాట్లాడుతున్నారు. అది అమ్మఒడి కాదు.. తల్లికి వందనం. ఎంతమంది విద్యార్థులు తల్లికి వందనం కింద లబ్ధిపొందారో ముందు వైసీపీ సభ్యులు స్పష్టత తెచ్చుకోవాలన్నారు. ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే వాట్సాప్ ద్వారా సంప్రదించాలని చెప్పామని లోకేష్ అన్నారు.
Andhra Pradesh
Thalliki Vandanam
Nara Lokesh
Education Scheme
Student Welfare
IT & Education Department
అమ్మఒడి
విద్యార్థి సహాయం
అర్హులందరికీ తల్లికి వందనం
Scroll for the next article