News12th Nov 11:53 AMSunil Byrisetty1 min read
జనసేన ఆఫీస్ పేరుతో ఏడు కోట్లకు మోసం
మంగళగిరి జనసేన స్టేట్ పార్టీ ఆఫీస్ పేరుతో ఏడు కోట్ల రూపాయల మోసం వెలుగులోకి వచ్చింది. ఏలూరు ,తణుకు ప్రాంతాల్లో ఉద్యోగాల పేరుతో మోసగాళ్లు దాదాపుగా 20 మంది వద్ద నుంచి ఏడు కోట్ల రూపాయల
మంగళగిరి జనసేన స్టేట్ పార్టీ ఆఫీస్ పేరుతో ఏడు కోట్ల రూపాయల మోసం వెలుగులోకి వచ్చింది. ఏలూరు ,తణుకు ప్రాంతాల్లో ఉద్యోగాల పేరుతో మోసగాళ్లు దాదాపుగా 20 మంది వద్ద నుంచి ఏడు కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఈ వ్యవహారంపై జనసేన నేత,స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాసరావు (కె.కె), కోటా రుక్మిణి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. మంగళగిరి జనసేన స్టేట్ పార్టీ ఆఫీస్ గుర్తులను వాడటంతోపాటు కళ్యాణం శివ శ్రీనివాస్, కోట రుక్మిణి పేర్లను ఉపయోగించి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి గగరా ధరణి అనే వ్యక్తి ఏలూరు, తణుకు ప్రాంతాలలో 20 మంది వద్ద మంచి ఏడు కోట్లు వసూలు చేసి పరారయ్యాడు. ఈ ఘరానా మోసం గురించి జనసేన స్టేట్ పార్టీ ఆఫీస్ కి చేరడంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు.