News2nd Oct 02:05 PMSunil Byrisetty1 min read
70 మంది వైద్యులకు ఉద్వాసన
సుదీర్ఘకాలంగా విధులకు గైర్హాజరీలో ఉన్న 70 మంది వైద్యులను డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (డీఎస్‌హెచ్) తొలగించింది. ఏడాదికిపైగా అనధికారికంగా విధులకు గైర్హాజరీలో ఉన్న వీరికి ప్రభుత్వ సి
సుదీర్ఘకాలంగా విధులకు గైర్హాజరీలో ఉన్న 70 మంది వైద్యులను డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (డీఎస్‌హెచ్) తొలగించింది. ఏడాదికిపైగా అనధికారికంగా విధులకు గైర్హాజరీలో ఉన్న వీరికి ప్రభుత్వ సివిల్ సర్వీసు నిబంధనల ప్రకారం సంజాయిషీ నోటీసులు జారీ చేసి, ఇతర నిబంధనలను అనుసరించి చివరి చర్యగా విధుల నుంచి తప్పించాలని శాఖాపరంగా నిర్ణయించినట్లు అధికారులు వైద్య, శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు వివరించారు. రూల్ నంబర్ 20 ఆఫ్ ఏపీసీఎస్ (సీసీఏ) రూల్స్-1991 అనుసరించి వీరిపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ హోదాలో ఉన్న వీరిలో గైనిక్, ఈఎన్‌టీ, జనరల్ మెడిసిన్, ఇతర స్పెషాల్టీ వైద్యులు ఉన్నారని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధర్ బాబు తెలిపారు. డీఎస్‌హెచ్ పరిధిలోనే మరో 154 మంది వైద్యులు అనధికారికంగా విధులకు గైర్హాజరీలో ఉన్నారు. వీరి విషయంలోనూ నిబంధనలను అనుసరించి సంజాయిషీ నోటీసులను జారీ చేశారు. తదుపరి చర్యలు వివిధ దశల్లో ఉన్నాయి. నోటీసుల అనంతరం విధుల్లో చేరేందుకు ముందుకొస్తే ఇంక్రిమెంట్లలో కోత వంటి క్రమశిక్షణా చర్యలను అనుసరించి అవకాశాలను కల్పిస్తున్నారు.