News25th Dec 10:28 AMSunil Byrisetty1 min read
గిరిజన విద్యార్థుల స్కాలర్ షిప్ లు విడుదల
గిరిజన విద్యను ప్రోత్సహిస్తూ, స్కూల్స్, హాస్టల్స్ లో మౌలిక సదుపాయాలు, వైద్య సౌకర్యాలు కల్పిస్తూ పౌష్టికాహారం అందిస్తూ వారి జీవితంలో కోరుకున్నది ఎదైనా సాధించగలమనే విశ్వాసాన్ని కలిగి
గిరిజన విద్యను ప్రోత్సహిస్తూ, స్కూల్స్, హాస్టల్స్ లో మౌలిక సదుపాయాలు, వైద్య సౌకర్యాలు కల్పిస్తూ పౌష్టికాహారం అందిస్తూ వారి జీవితంలో కోరుకున్నది ఎదైనా సాధించగలమనే విశ్వాసాన్ని కలిగించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అన్నారు. గిరిజన విద్యార్థులకు సంబంధించిన పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల విషయంలో గత ప్రభుత్వ కాలంలో పెండింగ్‌లో ఉన్న బకాయిలను కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరించామని చెప్పారు.
అర్హులైన ప్రతి విద్యార్థికి న్యాయం చేకూరేలా నిధుల విడుదల చేయడం జరిగిందని తెలిపారు.
2023–24 విద్యాసంవత్సరం
గత ప్రభుత్వం కేవలం ₹18.67 కోట్లు మాత్రమే విడుదల చేయగా, పెండింగ్‌లో ఉన్న మూడు త్రైమాసికాలకుగాను (3 క్వార్టర్స్) ₹71.67 కోట్లు 69,227 మంది విద్యార్థులకు కూటమి ప్రభుత్వం విడుదల చేసి, నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశామని పేర్కొన్నారు.