News22nd Oct 05:21 PMSunil Byrisetty1 min read

సంక్షేమ పథకాలపై 75 శాతం మంది సంతృప్తి

ఏపీలో ప్రజలకు సంక్షేమ పథకాల అమలుపై RTGS ద్వారా సమాచారం తీసుకుంటున్నామని మంత్రి కొలుసు పార్ధసారథి తెలిపారు. ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్‌లో సంతృప్తి 75 శాతం ఉందన్నారు. ప్రతిరోజు 10 లక్షల

సంక్షేమ పథకాలపై 75 శాతం మంది సంతృప్తి
ఏపీలో ప్రజలకు సంక్షేమ పథకాల అమలుపై RTGS ద్వారా సమాచారం తీసుకుంటున్నామని మంత్రి కొలుసు పార్ధసారథి తెలిపారు. ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్‌లో సంతృప్తి 75 శాతం ఉందన్నారు. ప్రతిరోజు 10 లక్షల మందికి ఫోన్‌ చేసి సమాచారం తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజల ఫీడ్‌బ్యాక్‌ను కూడా ఎనలైజ్‌ చేస్తున్నామని, ఇంధనశాఖపై ప్రజల సంతృప్తి శాతం బాగుందని వివరించారు. ఇసుక పాలసీపైనా ప్రజల ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నామని, హౌసింగ్‌పై ప్రజల అభిప్రాయాలు తీసుకున్నామని పేర్కొన్నారు. పెండిoగ్‌ బిల్లులు చెల్లించాలని సీఎం ఆదేశించారన్నారు. వాట్సాప్‌ యాప్‌ పౌరసేవలను ప్రజలు సరిగా వినియోగించడం లేదని.. యూజర్‌ ఫ్రెండ్లీ సాఫ్ట్‌వేర్‌ తేవాలని సీఎం ఆదేశించారని తెలిపారు. 16 నెలల్లో 7 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పనకు నిర్ణయం తీసుకున్నామని.. అర్బన్‌ ఏరియాలో 50 వేల ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి కొలుసు పార్ధసారథి వివరించారు.
Andhra Pradesh
Welfare Schemes
Kollu Parthasarathy
RTGS Feedback
Public Satisfaction
Government Programs
ఇసుక పాలసీ
చంద్రబాబు నాయుడు
సంక్షేమ పథకాలు
Scroll for the next article