News10th Nov 05:58 PMSunil Byrisetty1 min read

రూ. 750 కోట్లతో అపెక్స్ యోగా అండ్ నేచురోపతి రీసెర్చి ఇనిస్టిట్యూట్

కేంద్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా 'అపెక్స్ రీసెర్చి ఇన్స్టిట్యూటు ఫర్ యోగా అండ్ నేచురోపతి' (ఆర్' వై ఎస్)ను రాష్ట్రంలో రూ.750 కోట్లతో ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చిందని రాష్ట్ర వైద

రూ. 750 కోట్లతో అపెక్స్ యోగా అండ్ నేచురోపతి రీసెర్చి ఇనిస్టిట్యూట్
కేంద్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా 'అపెక్స్ రీసెర్చి ఇన్స్టిట్యూటు ఫర్ యోగా అండ్ నేచురోపతి' (ఆర్' వై ఎస్)ను రాష్ట్రంలో రూ.750 కోట్లతో ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఎయిమ్స్ తరహాలో కేంద్ర ప్రభుత్వం ద్వారానే ఈ సంస్థ కార్యకలాపాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. సెంట్రల్ కౌన్సెల్ ఫర్ రీసెర్చి అండ్ యోగా అండ్ నేచురోపతి (మినిస్టరీ ఆఫ్ ఆయుష్) ద్వారా ఏర్పాటుకానున్న ఈ ప్రముఖ విద్యా సంస్థలో యూజీ (బ్యాచులర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగా సర్జరీ)లో తొలి ఏడాదిలో వంద సీట్లు, పీజీలో 20 సీట్ల చొప్పున భర్తీ జరుగుతుందని ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా 450 పడకలతో అన్ని రకాల వసతులతో నేచురోపతి (ప్రకృతి) ఆసుపత్రి అందుబాటులోనికి వస్తుందని పేర్కొన్నారు. ఈ సంస్థలో రీసెర్చి అండ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు అవుతుందని పేర్కొన్నారు. ప్రఖ్యాత విద్యా సంస్థ ఏర్పాటుకు 40 ఎకరాలను కేటాయించాలని కేంద్ర ఆయుష్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని చెప్పారు.
Andhra Pradesh
Apex Yoga Institute
Naturopathy Research
Ministry of AYUSH
Andhra Pradesh
Health Infrastructure
Yoga Education
వైద్య పరిశోధన
యూజీ పీజీ కోర్సులు
ప్రకృతి వైద్యం
కేంద్ర ప్రభుత్వం
వెల్‌నెస్
Scroll for the next article