Spiritual17th Oct 06:04 PMSunil Byrisetty1 min read
దసరా సేవల్లో 750 మంది ఎన్ఎస్ఎస్, 100 మంది రెడ్ క్రాస్ వాలంటీర్లు
ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో జరుగుతున్న దసరా మహోత్సవాల్లో ఏడవ రోజు కూడా ఎన్టీఆర్ జిల్లా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు ఉత్సాహంగా
ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో జరుగుతున్న దసరా మహోత్సవాల్లో ఏడవ రోజు కూడా ఎన్టీఆర్ జిల్లా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు ఉత్సాహంగా సేవలందిస్తున్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశా, ఐఏఎస్ ఆదేశాల మేరకు 750 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, 100 మంది యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు భక్తులకు వివిధ రూపాల్లో సేవలందిస్తున్నారు. ప్రతిరోజూ మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తున్న వాలంటీర్లు భక్తులకు తాగునీరు, మజ్జిగ, పాలు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమంలో సహకరిస్తున్నారు. అదేవిధంగా వైద్య సేవలకు సహకరించడం, వృద్ధులు, దివ్యాంగులకు అవసరమైన సహాయం అందించడం, భక్తుల రద్దీని నియంత్రించడం వంటి సేవల్లో చురుకుగా పాల్గొంటున్నారు. రాత్రింబవళ్లు నిరంతరాయంగా సేవలందిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తమ వంతు కృషి చేస్తున్నారు. దసరా సెలవులు ఉన్నప్పటికీ వ్యక్తిగత సెలవులను పక్కనపెట్టి, భక్తులకు సేవ చేయాలనే సంకల్పంతో యువతీ యువకులు గత ఏడు రోజులుగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.