News8th Sep 12:20 PMSunil Byrisetty1 min read
తొలిరోజే 75 వేల దరఖాస్తులు
ఏపీలో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం కింద కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. దీంతో త
ఏపీలో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం కింద కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. దీంతో తొలిరోజైన సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 75 వేలమంది దరఖాస్తు చేసుకున్నారు. ధ్రువీకరణ పత్రాలు తీసుకుని ఉదయం నుంచే సచివాలయాల వద్ద దరఖాస్తుదారులు బారులు తీరారు. రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు ఒకేసారి ఎక్కువ మందివి దరఖాస్తు చేసేందుకు ప్రయత్నించడంతో సర్వర్ నెమ్మదించింది.