Health31st Oct 04:20 PMSunil Byrisetty1 min read

75 వేల సదరం స్లాట్లు విడుదల

దివ్యాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించి సదరం ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నవంబర్‌, డిసెంబర్‌ నెలలకు సంబంధించి 75 వేల స్లాట్లను విడుదల చేయనుంది. నవంబర్‌ 2న ఉదయం

75 వేల సదరం స్లాట్లు విడుదల
దివ్యాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించి సదరం ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నవంబర్‌, డిసెంబర్‌ నెలలకు సంబంధించి 75 వేల స్లాట్లను విడుదల చేయనుంది. నవంబర్‌ 2న ఉదయం 10.30 గంటలకు స్లాట్‌ బుకింగ్‌ ప్రారంభమై డిసెంబర్‌ 31 వరకు కొనసాగుతుంది. సచివాలయాలు, వాట్సాప్‌లోని మనమిత్ర సేవలు, ఏపీ సేవా పౌర సేవా పోర్టల్‌ ద్వారా దివ్యాంగులు స్లాట్లు బుక్‌ చేసుకోవచ్చు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ), ద్వితీయ ఆరోగ్య శాఖ (డీఎస్‌హెచ్‌) పరిధిలోని 117 ఆసుపత్రుల్లో ఈ వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపిoది. డీఎంఈ పరిధిలోని ఆసుపత్రుల్లో 21 రకాల దివ్యాంగత్వాలకు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించే సౌకర్యాలు ఉన్నాయి. ఈ ఆసుపత్రుల్లో వారానికి రెండు రోజుల చొప్పున, డీఎస్‌హెచ్‌ పరిధిలోని ఆసుపత్రుల్లో వారానికి ఒక రోజు చొప్పున పరీక్షలకు స్లాట్లు కేటాయించనున్నారు.
Scroll for the next article