News28th Jan 05:12 PMSunil Byrisetty1 min read

గత ప్రభుత్వ రీసర్వే గందరగోళం వల్ల 7.80 లక్షల భూ ఫిర్యాదులు

సర్వే రాళ్లపై జగన్ బొమ్మ వేయించేందుకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, సుమారు రూ.700 కోట్లను వైకాపా ప్రభుత్వం దోచుకుందని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పా

గత ప్రభుత్వ రీసర్వే గందరగోళం వల్ల 7.80 లక్షల భూ ఫిర్యాదులు
సర్వే రాళ్లపై జగన్ బొమ్మ వేయించేందుకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, సుమారు రూ.700 కోట్లను వైకాపా ప్రభుత్వం దోచుకుందని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వైసీపీ పార్టీ నాయకులు ‘క్రెడిట్ చోరీ’ అంటూ పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తుండటమే వీళ్ల భయానికి కారణమన్నారు. జగన్మోహన్ రెడ్డి భూ రీసర్వే పేరుతో గత ఐదేళ్లలో చేసిన దోపిడీలు, ఆక్రమణలు ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. అందుకే పట్టాదారు పాస్ పుస్తకాలు చేతికి వస్తే తమ దుర్మార్గాలు మళ్లీ గుర్తొస్తాయేమో అన్న భయంతో, వీళ్లంతా బయటకు వచ్చి ‘క్రెడిట్ చోరీ’ అంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కానీ వాస్తవం ఏమిటంటే, 2018లోనే తెలుగుదేశం ప్రభుత్వం మంచి ఉద్దేశంతో, రైతుల భూములకు భద్రత కల్పించాలనే లక్ష్యంతో భూ రీసర్వే ప్రక్రియను ప్రారంభించిందని గుర్తు చేశారు.
Andhra Pradesh Politics
Land Resurvey
Land Complaints
TDP
YSRCP
MLA Madhavi Reddy
Chandrababu Naidu
పట్టాదారు పాస్ పుస్తకాలు
రైతుల సమస్యలు
రాజకీయ ఆరోపణలు
ఏపీ భూ సమస్యలు
Scroll for the next article