TTD9th Jan 01:08 PMSunil Byrisetty1 min read
7.83 లక్షల మందికి వైకుంఠద్వార దర్శనం
వైకుంఠద్వార దర్శనాలపై టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది వైకుంఠద్వార దర్శనాలు అత్యంత అద్భుతంగా నిర్వహించామన్నారు.వైకుంఠద్వార దర్శనాల్లో 93 శాతం మంది భక్తులు
వైకుంఠద్వార దర్శనాలపై టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది వైకుంఠద్వార దర్శనాలు అత్యంత అద్భుతంగా నిర్వహించామన్నారు.వైకుంఠద్వార దర్శనాల్లో 93 శాతం మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. 2023లో 6 లక్షల 47 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటే.. 2024లో 6లక్షల 83వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని వివరించారు. ఈ ఏడాది అత్యధికంగా 7.83 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారని, 10 రోజుల్లో శ్రీవారికి రూ.41.14 కోట్ల కానుకలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ సారి వైకుంఠద్వార దర్శనాల్లో 44 లక్షల లడ్డూలు విక్రయించామన్నారు. గతేడాది కంటే 27% అధికంగా భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశామని తెలిపారు. శ్రీవారి అలంకరణకు 50 టన్నుల పుష్పాలు వినియోగించినట్లు చెప్పారు. 2 లక్షలకు పైగా భక్తులు తలనీలాలు సమర్పించారని టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు గణాంకాలు వివరించారు.