National15th Aug 09:49 AMSunil Byrisetty1 min read

దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్య్ర వేడుకలు

దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. దిల్లీలో ఎర్రకోటపై మువ్వెన్నెల జెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష

దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్య్ర వేడుకలు
దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. దిల్లీలో ఎర్రకోటపై మువ్వెన్నెల జెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, ప్రత్యేక అతిథుల సమక్షంలో జాతీయ జెండా సగర్వంగా రెపరెపలాడింది. ఈ క్రమంలో ఎర్రకోట వద్ద ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు. 2047 వికసిత భారత్‌ విజన్తో, నయా భారత్ థీమ్‌తో పంద్రాగస్టు వేడుకలు నిర్వహించారు. అంతకుముందు, ప్రధాని నరేంద్ర మోదీ రాజ్ఘాట్కు చేరుకుని మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం ఎర్రకోటకు చేరుకున్న మోదీకి రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్వాగతం పలికారు. ఆ తర్వాత ప్రధాని రక్షణ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, జాతినుద్దేశించి మోదీ ప్రసంగించారు.
India
Independence Day 2025
Narendra Modi
Red Fort
National Flag
Tricolor
15 August
Freedom Day Celebrations
Developed
Naya Bharat
స్వాతంత్ర్య దినోత్సవం 2025
జాతీయ పతాకం
త్రివర్ణ పతాకం
Scroll for the next article