News15th Aug 01:57 PMSunil Byrisetty1 min read

హైకోర్టులో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

రాజధాని అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైకోర్టు ప్రాంగణంలో శుక్రవారం ఉదయం జరిగిన ఈవేడుకలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

హైకోర్టులో ఘనంగా  స్వాతంత్ర్య వేడుకలు
రాజధాని అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైకోర్టు ప్రాంగణంలో శుక్రవారం ఉదయం జరిగిన ఈవేడుకలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ముఖ్య అతిధిగా పాల్గొని మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ పతాకానికి సెల్యూట్ చేసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చేందుకు ప్రాణాలను సైతం అర్పించిన మహానుభావులకు శిరస్సు వంచి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ స్వరాజ్యం, స్వపరిపాలన భారతీయుల జన్మహక్కు అంటూ నినాదాలు చేస్తూ స్వాతంత్య్ర సాధనకై ఎంతో మంది తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి వలస వాదుల పాన నుండి భారత దేశాన్నికి విముక్తి కలిగించారన్నారు. నేడు అటువంటి మహానుభావుల అందరినీ స్మరించుకుంటూ శిరస్సు వంచి ప్రణామాలు చేయాల్సిన శుభదినం అన్నారు. ఆ మహానుభావులు దేశానికి చెందిన సేవలను ప్రశంసిస్తూ వారి అడుగుజాడల్లో రాష్ట్ర ప్రజలు అందరూ నడుస్తూ రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. వారి దేశభక్తి, జాతీయవాదం ప్రస్తుత మరియు రానున్న తరాలవారికి ఎంతో స్పూర్తిదాయకం అన్నారు.
Andhra Pradesh
High Court
Amaravati
Independence Day 2025
Justice Dhiraj Singh Thakur
National Flag Hoisting
Freedom Fighters Tribute
హైకోర్టులో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు
Scroll for the next article