News14th Jul 08:40 AMSunil Byrisetty1 min read

అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ బోల్తా పడి తొమ్మిది మంది మృతిచెందారు. రాజంపేట నుంచి రైల్వేకోడూరు మార్కెట్‌కు మామిడికాయల లోడుతో వెళ్తున్న సమయంలో రెడ్డిపల్ల

అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ బోల్తా పడి తొమ్మిది మంది మృతిచెందారు. రాజంపేట నుంచి రైల్వేకోడూరు మార్కెట్‌కు మామిడికాయల లోడుతో వెళ్తున్న సమయంలో రెడ్డిపల్లె చెరువుకట్టపై లారీ అదుపు తప్పి బోల్తా పడింది. లారీ బోల్తా పడటంతో 10 మంది కూలీలకు తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. మృతులు సబ్బరత్నమ్మ(45), చిట్టెమ్మ(25), గజ్జల లక్ష్మీదేవి (36), రాధ (39), వెంకట సుబ్బమ్మ(37) గజ్జల రమణ(42), మణిచంద్ర(38), గజ్జల దర్గయ్య(32), గజ్జల శీను(33) గుర్తించారు. ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Andhra Pradesh news
Annamayya district
road accident
Rail way Koduru
lorry accident
JanardhanReddy
mango load
అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం
Scroll for the next article