News13th Nov 10:34 AMSunil Byrisetty1 min read

సదరం స్లాట్లలో 84.47 శాతం బుకింగ్‌

దివ్యాంగులకు సదరం వైకల్య ధ్రువపత్రాలను సకాలంలో అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. నవంబర్‌ 2 నుంచి ప్రారంభమైన స్లాట్ల బుకింగ్‌లో గురువారం నాటికి మొత్తం 75,350 స్లాట్లక

సదరం స్లాట్లలో 84.47 శాతం బుకింగ్‌
దివ్యాంగులకు సదరం వైకల్య ధ్రువపత్రాలను సకాలంలో అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. నవంబర్‌ 2 నుంచి ప్రారంభమైన స్లాట్ల బుకింగ్‌లో గురువారం నాటికి మొత్తం 75,350 స్లాట్లకు 63,637 మంది నమోదు చేసుకున్నారు. దీంతో 84.47 శాతం స్లాట్లు నిండగా.. మరో 11,713 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. వైకల్య నిర్ధారణ పరీక్షలు కూడా ప్రారంభమయ్యాయి. అనంతపురం, బాపట్ల, మార్కాపురం, ఎన్టీఆర్‌, పల్నాడు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కేటాయించిన స్లాట్లన్నీ నిండిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 117 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 1,696 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. శ్రీకాకుళంలో 1,194, విజయనగరంలో 1,138, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 1,111 స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. విశాఖపట్నంలో 727, కాకినాడలో 617, తూర్పు గోదావరిలో 550, ప్రకాశంలో 516, పార్వతీపురం మన్యంలో 509, గుంటూరులో 442, తిరుపతిలో 436, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 402 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లోనూ స్లాట్ల బుకింగ్‌ వివరాలను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.
Scroll for the next article