Telangana30th Oct 06:13 PMSunil Byrisetty1 min read
84,790 కోట్లతో హైదరాబాద్ అభివృద్ధి
ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. నగరాభివృద్ధి, రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల పాత
ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. నగరాభివృద్ధి, రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల పాత్ర కీలకమని అన్నారు. ఈ రంగాల్లో ఉన్నవారిని కేవలం వ్యాపారవేత్తలుగా కాకుండా సంపద సృష్టికర్తలుగా ప్రభుత్వం గుర్తిస్తోందని తెలిపారు. హైదరాబాద్ హైటెక్స్‌లో నిర్వహించిన నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్‌కు ఇప్పటికే అనేక అనుకూలతలు ఉన్నాయని, దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఇక్కడ స్థిరపడేందుకు ఆసక్తి చూపుతున్నారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, బీహెచ్‌ఈఎల్, బీడీఎల్, ఈసీఐఎల్, డీఆర్‌డీఓ వంటి సంస్థలు, ఐఐటీ, ఐఐఐటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వంటి విద్యాసంస్థలు నగర అభివృద్ధికి బలమైన పునాదులుగా నిలిచాయని చెప్పారు. ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను మరింత విస్తరిస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు.