Spiritual28th Jul 12:28 PMSunil Byrisetty1 min read

విశాఖలో కోటి గాజులతో కొలువుదీరనున్న గణపతి

విశాఖలో కోటి గాజుల గణపతి కొలువుదీరనున్నాడు. వినాయక చవితి పండుగ సమీపిస్తుండటంతో వినూత్న రీతిలో గణేషుడి విగ్రహాల తయారీకి భక్తులు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా విశాఖపట్నంలో వినూత్న

విశాఖలో కోటి గాజులతో కొలువుదీరనున్న గణపతి
విశాఖలో కోటి గాజుల గణపతి కొలువుదీరనున్నాడు. వినాయక చవితి పండుగ సమీపిస్తుండటంతో వినూత్న రీతిలో గణేషుడి విగ్రహాల తయారీకి భక్తులు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా విశాఖపట్నంలో వినూత్న శైలిలో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. గాజువాక ప్రాంతంలోని శ్రీనగర్‌లో కోటికి పైగా గాజులతో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నానికి చెందిన ఎస్‌వి ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ, కోటికిపైగా గాజులను ఉపయోగించి.. శ్రీ దివ్య కంకణ అలంకార మహా గణపతి పేరుతో 89 అడుగుల ఎత్తైన వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది. గతంలో ఇదే గాజువాక ప్రాంతంలోని లంకా గ్రౌండ్స్‌లో లక్ష కాటన్, పట్టు చీరలతో శ్రీ సుందర వస్త్ర మహా గణేశ పేరుతో 89 అడుగుల ఎత్తైన వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన కళాకారుల బృందం, వివిధ రంగుల మట్టి గాజులతో 89 అడుగుల ఎత్తైన వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విగ్రహ తయారీలో చిన్న చెక్క దుంగలు, కేన్ వంటి పర్యావరణ అనుకూల పదార్థాలను ఉపయోగిస్తున్నారు. వినాయక చవితి పండుగకు ముందుగానే విగ్రహాన్ని సిద్ధం చేయనున్నారు.
Andhra Pradesh
Visakhapatnam
Ganesh Idol
Vinayaka Chavithi
Bangle Ganesh
One Crore Bangles
Eco Friendly Ganesh
మట్టి గాజులు
ప్రకాశం జిల్లా కళాకారులు
ఆంధ్రప్రదేశ్
గణేశ్ ఉత్సవాలు
వినూత్న గణపతి
Scroll for the next article