Jobs23rd Sep 01:39 PMSunil Byrisetty1 min read

గిరిజన ప్రాంతాల్లో 90% వైద్యుల పోస్టుల భర్తీ

గిరిజన ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టుల భర్తీకి అధిక ప్రాధాన్యత‌నిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. "ఉద్యోగ, స్వచ్ఛంద ఉద్యోగ విరమ

గిరిజన ప్రాంతాల్లో 90% వైద్యుల పోస్టుల భర్తీ
గిరిజన ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టుల భర్తీకి అధిక ప్రాధాన్యత‌నిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. "ఉద్యోగ, స్వచ్ఛంద ఉద్యోగ విరమణలవల్ల వైద్యుల కొరత ఏర్పడుతుండగా వెంటనే భర్తీకి చర్యలు తీసుకుంటున్నాం. ప్రజారోగ్యమే లక్ష్యంగా వాక్-ఇన్-ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తున్నాం. వదోన్నతులు కూడా చేబడుతున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన‌ అనంతరం గిరిజన ప్రాంతాల్లోని 153 పీహెచ్సీలకు కలిపి 306 సివిల్ అసిస్టెంటు సర్జన్ పోస్టులు మంజూరయ్యాయి. ఇందులో ఖాళీగా ఉన్న 138కు 131 పోస్టుల (90%)ను గత 5 నెలల్లో భర్తీ చేశాం. ప్రస్తుతం 31 పోస్టులు (10%) ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి కూడా చర్యలు తీసుకుంటున్నాం. ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా ఆసువత్రిని బోధనాసుపత్రిగా మార్చేందుకు గత వైకాపా ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో గందరగోళం నెలకొన్నందున వైద్యులు, మౌలిక సదుపాయాలకు కొరత ఏర్పడింది. నిర్మాణాలకు రూ.47 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టింది. 625 పడకలతో మార్కావురం వైద్య కళాశాలను పీపీపీ విధానంలో నడపాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింద"ని మంత్రి సత్యకుమార్ యాద‌వ్‌ వివరించారు.
Andhra Pradesh
Tribal Healthcare
Doctor Recruitment
Public Health
Health Ministry
Medical Staff
Hospital Development
Rural Health
Walk-In Interviews
Healthcare Initiatives
మార్కాపురం వైద్య కళాశాల
సివిల్ అసిస్టెంట్ సర్జన్
వైద్య నియామకాలు
Scroll for the next article