News8th Apr 12:18 PMSunil Byrisetty1 min read
కియాలో భారీ చోరీ.. ఏకంగా 900 ఇంజిన్లు మాయం
శ్రీసత్యసాయి జిల్లాలోని కియా పరిశ్రమలో భారీ చోరీ జరిగింది. కియా పరిశ్రమలో సుమారు 900 కార్ల ఇంజిన్లు మాయమయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 19న ఈ ఘటనపై కియా యాజమాన్య
శ్రీసత్యసాయి జిల్లాలోని కియా పరిశ్రమలో భారీ చోరీ జరిగింది. కియా పరిశ్రమలో సుమారు 900 కార్ల ఇంజిన్లు మాయమయ్యాయి.
ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 19న ఈ ఘటనపై కియా యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కియా ప్రతినిధులు అధికారికంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.
పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నారు.
దీనిపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) దర్యాప్తు చేస్తోంది. కియా పరిశ్రమకు పలు ప్రాంతాల నుంచి కంటైనర్ల ద్వారా కార్ల ఇంజిన్లు వస్తుంటాయి.
ఈ క్రమంలో చోరీ జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు