News10th Jul 10:20 AMSunil Byrisetty1 min read
సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు మంత్రివర్గ సమావేశం
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో 19వ SIPB, CRDA నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.ఈ క్యాబినెట్ సమావేశంలో ఆమోదం పొందనున్న ముఖ్య ప్ర
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో 19వ SIPB, CRDA నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.ఈ క్యాబినెట్ సమావేశంలో ఆమోదం పొందనున్న ముఖ్య ప్రతిపాదనల వివరాలు ఇలా..
రూ.9 వేల కోట్ల పెట్టుబడులతో కూడిన ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.
ఈ ప్రాజెక్టుల ద్వారా 10 వేలకు పైగా ఉద్యోగాలు లభించనున్నాయి.అమరావతిలో రెండో విడత భూసమీకరణ చేస్తున్న ఏడు గ్రామాల రైతులకు రుణమాఫీ ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది.
ఈ రుణమాఫీ కింద ఒక్కో కుటుంబానికి రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ అమలు చేసే ప్రతిపాదనకు ఆమోదం లభించనుంది.
307 ఎకరాల ఇనాం భూములకు సంబంధించి, దేవాదాయ శాఖకు రూ.159 కోట్ల పరిహారం చెల్లింపునకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.