Spiritual1st Nov 09:22 AMSunil Byrisetty1 min read
900 ఏళ్ల నాటి రంగులు మారే అరుదైన విగ్రహం లభ్యం
తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం 900 సంవత్సరాల నాటి విగ్రహం లభ్యమైంది. గ్రామంలో 100 సంవత్సరాల నాటి విఘ్నేశ్వర స్వామి ఆలయం జీర్ణావస్థకు రావడంతో పునర్నిర్మించడానికి దేవాలయాన్ని
తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం 900 సంవత్సరాల నాటి విగ్రహం లభ్యమైంది. గ్రామంలో 100 సంవత్సరాల నాటి విఘ్నేశ్వర స్వామి ఆలయం జీర్ణావస్థకు రావడంతో పునర్నిర్మించడానికి దేవాలయాన్ని కూల్చివేశారు. ఈ నేపథ్యంలో తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షానికి మట్టి కరిగి విగ్రహం తల కనపడటంతో అక్కడే ఉన్న సత్యనారాయణ అనుమానంతో తవ్వి చూశారు. పురాతన విగ్రహం బయటపడడంతో గ్రామస్తులు అక్కడకు చేరుకుని విగ్రహాన్ని బయటకు తీసి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ పెద్దలు ఈ విశేషానికి విగ్రహాన్ని పరీక్షించడానికి ప్రముఖ తిరుపతి దేవస్థాన ఆస్థాన పండితులు వెంకటేశ్వర శాస్త్రిని పిలిపించారు. విగ్రహాన్ని పరీక్షించిన పండితులు ఈ విగ్రహం రుక్మిణీ సమేత గోపాల స్వామి విగ్రహం అని, ఇది 900 సంవత్సరాల క్రితం నాటి విగ్రహం అత్యంత మహిమా గల విగ్రహమని తెలిపారు. ఈ విగ్రహాన్ని నీటితో కడగగా లేత ఆకుపచ్చ రంగుగా మారుతుందని ఇటువంటి రాయి భారతదేశంలో ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనే దొరుకుతుందని ఆయన అన్నారు. ఇటువంటి విగ్రహాలు దక్షిణ భారతదేశంలో చాలా అరుదుగా మూడు చోట్ల మాత్రమే ఉన్నాయని ఆయన తెలియజేశారు. దీంతో ఆనందోత్సాహంలో గ్రామస్తులు పెద్దల సహకారంతో ఆలయాన్ని నిర్మిస్తామని తెలిపారు.