News28th Dec 10:22 AMSunil Byrisetty1 min read

ఏడాదిలో రూ.9500 కోట్ల రైల్వే ప్రాజెక్టులు

కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌లో రూ.9,470 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు అనుమతినిచ్చినట్లు కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి సోమన్న వెల్లడించారు. ప్రస్తు

ఏడాదిలో రూ.9500 కోట్ల రైల్వే ప్రాజెక్టులు
కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌లో రూ.9,470 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు అనుమతినిచ్చినట్లు కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి సోమన్న వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎనిమిది వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయని, దేశంలోనే తొలిసారిగా హిందూపురంలో తాలూకా స్థాయిలో వందేభారత్‌కు స్టాపింగ్ కల్పించడం జరిగిందని ఆయన తెలిపారు. ఇది హిందూపురం ప్రజలకు ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన ప్రత్యేక బహుమతి అని ఆయన అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం, సోమందేపల్లిలో పర్యటించారు. సోమందేపల్లి మండలం చాకర్లపల్లి వద్ద రూ.4 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్‌ను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవితతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం హిందూపురం చేరుకున్న మంత్రి, ఎంపీ బీకే పార్థసారథితో కలిసి యశ్వంత్‌పురం - హైదరాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు హిందూపురంలో స్టాపింగ్‌ను ప్రారంభించారు.
Andhra Pradesh Development
Railway Projects
Central Government
Ministry of Railways
Somanna
Vande Bharat Express
Hindupur
Sri Sathya Sai District
ఎంపీ బీకే పార్థసారథి
యశ్వంత్‌పురం హైదరాబాద్ వందేభారత్
Scroll for the next article