News31st Aug 12:44 PMSunil Byrisetty1 min read
గొల్లపూడిలో 982వ ఉచిత యోగా శిక్షణ శిబిరం
ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి సాయిపురం కాలనీలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 982వ ఉచిత యోగా శిక్షణ శిబిరం ఆదివారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. ఈ శిబిరాన్ని తె
ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి సాయిపురం కాలనీలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 982వ ఉచిత యోగా శిక్షణ శిబిరం ఆదివారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. ఈ శిబిరాన్ని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శుభారంభం చేశారు. యోగా కేవలం శరీర వ్యాయామం మాత్రమే కాకుండా, మనసుకు ప్రశాంతతను, ఆత్మకు ఆధ్యాత్మిక బలం కలిగించే సాధనమని ఆయన అన్నారు.
ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రతి ఇంటి ప్రతి వ్యక్తి రోజువారీ జీవితంలో యోగా సాధనను తప్పనిసరిగా అలవర్చుకోవాలని సూచించారు. సమాజంలో ఇలాంటి శిబిరాలు ఎక్కువగా జరగాలని తన ఆకాంక్ష వ్యక్తం చేశారు.
డాక్టర్ వెంకటేశ్వర యోగి గురూజీ, శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వ్యవస్థాపకులు, ప్రధాన యోగా చార్యులు, శిబిరం ప్రత్యేకతలను వివరించారు. యోగా అనేది కేవలం శరీర వ్యాయామం కాదు, మనసు, శరీరం, ఆత్మ సమన్వయానికి దారితీసే సమగ్ర సాధన అని వివరించారు. 982వ ఉచిత శిక్షణ శిబిరం ద్వారా స్థానిక ప్రజలకు యోగా ప్రాముఖ్యతను చేరవేయడం మా లక్ష్యం” అన్నారు. శిబిరంలో స్థానికులు, మహిళలు, యువతతో పాటు వృద్ధులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.