Education22nd Jul 03:33 PMSunil Byrisetty1 min read
మెగా పీటీఎంకు రూ. 9.98 కోట్లు
రాష్ట్రంలోని పాఠశాలల్లో ఈ నెల 24న జరగనున్న ‘‘మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (MPTM 3.1)’’ నిర్వహణ కోసం రూ. 9.98 కోట్ల బడ్జెట్‌ను విడుదల చేసినట్లు స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ బి. శ్
రాష్ట్రంలోని పాఠశాలల్లో ఈ నెల 24న జరగనున్న ‘‘మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (MPTM 3.1)’’ నిర్వహణ కోసం రూ. 9.98 కోట్ల బడ్జెట్‌ను విడుదల చేసినట్లు స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ బి. శ్రీనివాసరావు తెలిపారు. ఈ నిధులను సమగ్ర శిక్ష జిల్లాల అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ల (APC) ఖాతాలకు జమ చేశామని తెలిపారు. సమగ్ర శిక్ష జిల్లాల అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు ఆ నిధులను బుధవారం సాయంత్రం 4 గంటల లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ సంబంధిత పాఠశాలల ఖాతాలకు బదిలీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిధుల విడుదలలో ఎలాంటి ఆలస్యం వహించరాదని హెచ్చరించారు. అధికారులు, ప్రధానోపాధ్యాయులు మెగా పీటీఎం నిర్వహణ ప్రణాళిక ప్రకారం అమలు చేయాలని కోరారు.