Education6th Jan 12:48 PMSunil Byrisetty1 min read
విద్యార్థులకు పండుగ వార్త.. సంక్రాంతికి 9 రోజుల సెలవులు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి విద్యార్థులకు భారీగా సంక్రాంతి సెలవులు ప్రకటించింది. ఏపీ విద్యాశాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం ఈ ఏడాది సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి జనవరి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి విద్యార్థులకు భారీగా సంక్రాంతి సెలవులు ప్రకటించింది. ఏపీ విద్యాశాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం ఈ ఏడాది సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి జనవరి 18 వరకు మొత్తం 9 రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ఉండనున్నాయి. జనవరి 10 రెండో శనివారం కావడంతో ఇప్పటికే సెలవు ఉంటుంది. జనవరి 12 సోమవారం సాధారణ పని దినమే అయినప్పటికీ, మరుసటి రోజు జనవరి 13న భోగి పండుగ ఉండటంతో ఆ రోజుకు ముందు రోజైన 12న కూడా సెలవు ఇచ్చారు. జనవరి 14న సంక్రాంతి పండుగ, 15న కనుమ పండుగలు ఉండటంతో ఆ రెండు రోజులు సహజంగానే సెలవులు కొనసాగుతాయి. జనవరి 16 శుక్రవారం ప్రత్యేక పండుగ ఏమీ లేకపోయినా, వెంటనే వచ్చే 17, 18 తేదీలు శని ఆదివారాలు కావడంతో మొత్తం వారాన్ని కలిపి సెలవులుగా ప్రకటించారు. జనవరి 19 సోమవారం నుంచి మళ్లీ పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. ఈ సెలవులు ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ స్కూళ్లకు కూడా వర్తిస్తాయని విద్యాశాఖ స్పష్టం చేసింది.