News2nd Jun 02:38 PMSunil Byrisetty1 min read
విజయవాడలో బోట్ మారథాన్!
విజయవాడలోని పున్నమి ఘాట్ లో బోట్ మారథాన్ నిర్వహిస్తున్నారు. బోట్ మారథాన్ ను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. విజయవాడలోని పున్నమి ఘాట్ లో ఆంధ్ర ప్రదేశ్ ఇన్‌లాండ్
విజయవాడలోని పున్నమి ఘాట్ లో బోట్ మారథాన్ నిర్వహిస్తున్నారు. బోట్ మారథాన్ ను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. విజయవాడలోని పున్నమి ఘాట్ లో ఆంధ్ర ప్రదేశ్ ఇన్‌లాండ్ వాటర్‌వేస్ అథారిటీ (APIWA) ఆధ్వర్యంలో నిర్వహించిన "బోట్ మారథాన్" కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ ఇన్‌లాండ్ వాటర్‌వేస్ అథారిటీ (APIWA) ఏర్పాటు చేసి నేటికి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా "బోట్ మారథాన్" కార్యక్రమంను జెండా ఊపి ప్రారంభించారు. ఈ "బోట్ మారథాన్" కార్యక్రమంలో మంత్రితో పాటు సంస్థ చైర్మన్ జెడ్. శివప్రసాద్, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, సంస్థ సీఈ రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.