News1st Jul 09:05 AMSunil Byrisetty1 min read
బాలుడి కష్టం విని కలెక్టర్ కన్నీళ్లు!
ఆడుతూ పాడుతూ బడికి వెళ్లాల్సిన ఎనిమిదేళ్ల బాలుడు తల్లి కష్టం చూసి కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళాడు. చిన్న వయసులో తనకు వచ్చిన కష్టానికి ఎనిమిదేళ్ల బాలుడు.. గుంటూరు కలెక్టరేట్ మెట్లు
ఆడుతూ పాడుతూ బడికి వెళ్లాల్సిన ఎనిమిదేళ్ల బాలుడు తల్లి కష్టం చూసి కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళాడు. చిన్న వయసులో తనకు వచ్చిన కష్టానికి ఎనిమిదేళ్ల బాలుడు.. గుంటూరు కలెక్టరేట్ మెట్లు ఎక్కాడు. తమ కుటుంబానికి జీవనాధారమైన టిఫిన్ బండిని నడుపుకునేందుకు అనుమతించాలంటూ.. ఆ బాలుడు కలెక్టర్ నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తన తల్లి టిఫిన్ బండి నడుపుకునేదని.. గుంటూరుకు చెందిన బాలుడు యశ్వంత్ తెలిపాడు. కొన్ని రోజుల క్రితం ఆ బండిని తొలగించారని.. మళ్లీ టిఫిన్ బండి పెట్టుకునేందుకు అనుమతివ్వాలని కోరాడు. తనకు గుండెకు సంబంధించిన సమస్య ఉందని.. జీవనాధారంగా ఉన్న చిన్న వ్యాపారాన్ని కొనసాగించేలా చూడాలని.. విజ్ఞప్తి చేశాడు. స్పందించిన కలెక్టర్ బాలుడి కష్టం విని చలించిపోయారు. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని అక్కడికక్కడే ఆదేశించారు.