Mobiles29th Jun 11:40 AMSunil Byrisetty1 min read

స్మార్ట్‌గా మడత పెట్టేద్దాం!

రోజుకో కొత్త మోడల్, మతిపోయే ఫీచర్లు.. సెల్‌ఫోన్లు చేస్తున్న చిత్రాలెన్నో! ఇప్పుడు మడతపెట్టే (ఫోల్డబుల్‌) స్మార్ట్‌ఫోన్ల హవా నడుస్తోంది. ట్యాబ్లెట్‌కి తక్కువగా.. స్మార్ట్‌ఫోన్‌కి ఎక

స్మార్ట్‌గా మడత పెట్టేద్దాం!
రోజుకో కొత్త మోడల్, మతిపోయే ఫీచర్లు.. సెల్‌ఫోన్లు చేస్తున్న చిత్రాలెన్నో! ఇప్పుడు మడతపెట్టే (ఫోల్డబుల్‌) స్మార్ట్‌ఫోన్ల హవా నడుస్తోంది. ట్యాబ్లెట్‌కి తక్కువగా.. స్మార్ట్‌ఫోన్‌కి ఎక్కువగా ఉన్న ఈ మడత ఫోన్లు కుర్రకారును ఆకర్షిస్తున్నాయి. అలాంటి ఫోన్లలో వన్‌ప్లస్‌ ఓపెన్‌ ముందు వరుసలో ఉంది. వన్‌ప్లస్‌ ఓపెన్‌ మూడో తరం ఫోల్డబుల్‌ ఫోను. క్వాల్‌కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెనరేషన్‌ సీపీయూ, భారీ స్టోరేజీ ర్యామ్‌ దీని సొంతం. 7.82 అంగుళాల తెర, వెనక 48+64 మెగా పిక్సెల్‌ కెమెరా, ముందు 20+32 మెగా పిక్సల్‌ కెమెరా ఉంటాయి. ఆండ్రాయిడ్‌ 13 ఆక్సిజన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో వస్తోంది. బరువు 245 గ్రాములతో వస్తోంది. ధర రూ. 1,39,998గా ఉంది.
Mobile
foldable smartphone
one plus
third generation foldable
Android 13 Oxygen
operating system
megapixel camera
Scroll for the next article