Jobs18th Jul 02:49 PMSunil Byrisetty1 min read

క్వాంట‌మ్ వ్యాలీతో యువ‌త‌కు ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు

ముఖ్య‌మంత్రి దార్శ‌నిక‌త‌కు ప్ర‌తిరూప‌మైన క్వాంట‌మ్ వ్యాలీతో రాష్ట్రంతోపాటు దేశ ముఖ‌చిత్ర‌మే మార‌బోతోంద‌ని అన్నారు. దీంతో యువ‌త‌కు ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు సొంత‌మ‌వుతుంద‌ని విజ‌య‌వాడ ఎం

క్వాంట‌మ్ వ్యాలీతో యువ‌త‌కు ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు
ముఖ్య‌మంత్రి దార్శ‌నిక‌త‌కు ప్ర‌తిరూప‌మైన క్వాంట‌మ్ వ్యాలీతో రాష్ట్రంతోపాటు దేశ ముఖ‌చిత్ర‌మే మార‌బోతోంద‌ని అన్నారు. దీంతో యువ‌త‌కు ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు సొంత‌మ‌వుతుంద‌ని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్‌డీసీ), కేశినేని ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో విజయవాడ పీబీ సిద్ధార్థ ఆర్ట్స్‌, సైన్స్ క‌ళాశాలలో మెగా జాబ్ మేళాను ఎంపీ కేశినేని శివ‌నాథ్‌, ఎమ్మెల్యే గద్దె రామ్మోహ‌న్ రావు, క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌.. క‌ళాశాల ప్రిన్సిప‌ల్ డా. ఎం.ర‌మేష్ ప్రారంభించారు. జాబ్‌మేళాలో 35కుపైగా సంస్థ‌లు పాల్గొన్నాయి. ఎస్ఎస్‌సీ, ఇంటర్, డిగ్రీ, పీజీ చేసిన వారికి మంచి జీతంతో ఉద్యోగాలు లభించాయి. రాబోయే రోజుల్లో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహిస్తామని అతిథులు తెలిపారు.
Andhra Pradesh
Vijayawada
MP Kesineni Sivanath
Quantum Valley
mega job fair
సిద్ధార్థ ఆర్ట్స్
సైన్స్ కళాశాలలో మెగా జాబ్ మేళా
Scroll for the next article