News12th Jun 05:31 PMSunil Byrisetty1 min read
ఆర్టీజీఎస్‌ను సందర్శించిన ఇథియోఫియా బృందం
సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) ను ఇథియోఫియా దేశానికి చెందిన ప్రతినిధుల బృందం సందర్శించింది. ఇథియోఫియా దేశ డిజిటల్ అగ్రికల్చర్ అండ్ ఫైన్సాన్స్ ప్ర
సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) ను ఇథియోఫియా దేశానికి చెందిన ప్రతినిధుల బృందం సందర్శించింది. ఇథియోఫియా దేశ డిజిటల్ అగ్రికల్చర్ అండ్ ఫైన్సాన్స్ ప్రోగ్రామ్ డైరెక్టర్ గిరుమ్ కెటెమా టెక్లెమారియం నేతృత్వంలో 10 మంది ప్రతినిధుల బృందం అమరావతిలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా ఈ బృందం ఆర్టీజీఎస్‌ను సందర్శించింది. ఈ బృందానికి ఆర్టీజీఎస్ డిప్యూటీ సీఈఓ ఎం. మాధురి స్వాగతం పలికారు. ఆర్టీజీఎస్ పనితీరు గురించి ఆమె ఈ బృందానికి వివరించారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సాంకేతిక వారధిలా ఆర్టీజీఎస్ పనిచేస్తున్న తీరు గురించి తెలిపారు. విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు వినూత్న ఆలోచనల నుంచి ఆర్టీజీఎస్ వ్యవస్థ రూపుదిద్దుకుందన్నారు. ఇలాంటి సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న మొట్టమొదటి రాష్ట్రంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మాత్రమేనన్నారు. మన మిత్ర పేరిట వాట్సాప్ గవర్నెన్స్‌ను ప్రారంభించిందన్నారు. ప్రస్తుతం 455 రకాల సేవలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందజేస్తున్నామని, రాబోయే రోజుల్లో ప్రజలకు వెయ్యికి పైగా సేవలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించాలన్నదే లక్ష్యమని చెప్పారు.