News20th Mar 05:09 PMSunil Byrisetty1 min read
వజ్రం కన్నా ఖరీదు.. కుక్కే కానీ రూ. 50 కోట్లు
20 ఏళ్ల క్రితం వచ్చిన రజినీకాంత్ సినిమా అరుణాచలంలో రూ. 30 కోట్లు 30 రోజుల్లో ఖర్చు చేయడం చూపిస్తారు. చివరి నిముషం వరకు ఖర్చు చేయలేక తంటాలు పడతాడు రజినీ. కానీ బెంగళూరుకు బెంగళూరుకు
20 ఏళ్ల క్రితం వచ్చిన రజినీకాంత్ సినిమా అరుణాచలంలో రూ. 30 కోట్లు 30 రోజుల్లో ఖర్చు చేయడం చూపిస్తారు.
చివరి నిముషం వరకు ఖర్చు చేయలేక తంటాలు పడతాడు రజినీ. కానీ బెంగళూరుకు బెంగళూరుకు చెందిన ప్రముఖ డాగ్ బ్రీడర్ మాత్రం రూ. 50 కోట్లను నిమిషాల్లో ఖర్చు పెట్టేశాడు. ఏం కొన్నాడా అనుకుంటున్నారా.. ఆ రూ. 50 కోట్లు పెట్టి ఓ కుక్కను కొనుగోలు చేశాడు.
ఇంతకీ ఆ కుక్క పేరేంటో చెప్పలేదు కదా.. ఆ కుక్క పేరు కాడాబాంబ్ ఒకామి.
ఒకామి అనే పేరు చైనా పేరులా కనిపిస్తుంది కానీ అది అమెరికాలో పుట్టింది.
తోడేలు, కాకేసియన్ షెపర్డ్ జాతి కుక్కకు క్రాస్ బ్రీడింగ్ చేయడంతో ఈ ఈ ప్రత్యేకమైన కుక్క పుట్టింది.
ఈ రకమైన క్రాస్ బ్రీడింగ్ తో పుట్టిన మొదటి కుక్క ఇదంట. అందుకే ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కుక్కలలో ఒకటిగా ఇది గుర్తింపు పొందింది. ఇప్పటికే 150 కంటే ఎక్కువ విభిన్న జాతులను కలిగి ఉన్న బెంగళూరుకు చెందిన ఎస్.సతీష్ దీనిని కొనుగోలు చేశారు.
"నేను ఈ కుక్కపిల్లని కొనడానికి 50 మిలియన్ రూపాయలు ఖర్చు చేశాను ఎందుకంటే నాకు కుక్కలంటే చాలా ఇష్టం.
ప్రత్యేకమైన కుక్కలను కలిగి ఉండి వాటిని భారతదేశానికి పరిచయం చేయడం ఇష్టం" అని సతీష్ వెల్లడించారు.
యునైటెడ్ స్టేట్స్‌లో జన్మించిన కాడాబాంబ్ ఒకామి వయస్సు కేవలం ఎనిమిది నెలలు కాగా.. ఇప్పటికే 75 కిలోలను మించిన బరువుంది. రోజూ 3 కిలోల పచ్చి మాంసం తింటుంది. ఈ కుక్కను పోషించడం ఆషామాషీ విషయం కాదు.