News28th Apr 02:45 PMSunil Byrisetty1 min read

చెట్టు తొర్రలో మద్యం.. కనిపెట్టిన నిఘా నేత్రం!

తిరుపతి జిల్లాలో చెట్టు తొర్రలో దాచి ఉంచిన నాటుసారా గుట్టును డ్రోన్ కెమెరా రట్టు చేసింది. జిల్లాలోని ఎర్రావారిపాలెం, భాకరాపేట, తలకోన, వేములవాడ గ్రామాలలో రహస్యంగా నాటుసారా తయారు చేస

చెట్టు తొర్రలో మద్యం.. కనిపెట్టిన నిఘా నేత్రం!
తిరుపతి జిల్లాలో చెట్టు తొర్రలో దాచి ఉంచిన నాటుసారా గుట్టును డ్రోన్ కెమెరా రట్టు చేసింది. జిల్లాలోని ఎర్రావారిపాలెం, భాకరాపేట, తలకోన, వేములవాడ గ్రామాలలో రహస్యంగా నాటుసారా తయారు చేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా వివిధ ప్రాంతాల్లో దాచి, రాత్రికి రాత్రే తరలిస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో సైతం ఈ ముఠా వ్యవహారం బయటపడలేదు. చెట్ల చాటున సారా తయారుచేసి, వాటి తొర్రల్లోనే దాచి ఉంచడంతో పోలీసులకు సైతం చిక్కలేదు. భాకరాపేట సీఐ ఇమ్రాన్‌ బాషా ఆధ్వర్యంలో అత్యాధునిక డ్రోన్‌లను రంగంలోకి దించి గాలించడంతో చెట్టు తొర్ర రహస్యం బయటపడింది. రహస్య స్థలాలను గుర్తించి, పోలీసులు మెరుపుదాడి చేయడంతో చెట్ల తొర్రల్లో దాచి వుంచిన 14 లీటర్ల నాటుసారా వెలుగులోకి వచ్చింది.
Tirupati
drone cam
tree trunk
Naatusara
Ap Police
చెట్టు తొర్రలో దాచి ఉంచిన నాటుసారా
వేములవాడ గ్రామాలలో రహస్యంగా నాటుసారా తయారు
14 లీటర్ల నాటుసారా
Scroll for the next article