Spiritual13th Nov 12:35 PMSunil Byrisetty1 min read
మహాభాగ్యం...అయ్యప్ప దీక్షా పరులకు నిత్యాన్నదానం
మాలధారణ చేసిన అయ్యప్ప భక్తులు కఠిన నియమాలతో దీక్ష చేస్తారు. ఉదయాష్టమ సంధ్యలలో స్వామికి పూజలు చేస్తూ ఏకభుక్తం తింటూ 41 రోజుల పాటు దీక్షను కొనసాగిస్తారు. కఠిన నియమాల్లో భిక్షకు, చద్ద
మాలధారణ చేసిన అయ్యప్ప భక్తులు కఠిన నియమాలతో దీక్ష చేస్తారు. ఉదయాష్టమ సంధ్యలలో స్వామికి పూజలు చేస్తూ ఏకభుక్తం తింటూ 41 రోజుల పాటు దీక్షను కొనసాగిస్తారు. కఠిన నియమాల్లో భిక్షకు, చద్దికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అధికశాతం అయ్యప్ప భక్తులు భిక్ష, చద్దిని ఇళ్లల్లోనే చేస్తుంటారు. అయితే అయ్యప్ప దీక్షా పరులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి యర్రబాలెం శివాలయంలో దాతల సహకారంతో భిక్ష, చద్ది కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దీక్షలో ఉన్న అయ్యప్ప భక్తులకు భిక్ష, అన్నదానం చేయడానికి చాలా మంది దాతలు ముందుకు వస్తున్నారు. దీక్షాధారులకు ఇబ్బంది లేకుండా భిక్ష, చద్ది చేసే అవకాశం కూడా కలుగుతుంది. ఉదయం, రాత్రి వేళల్లో భిక్ష (అల్పాహారం), మధ్యాహ్నం వేళ చద్ది (భోజనం) కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ప్రతి రోజూ దాదాపూ 150-200మంది అయ్యప్ప మాలధారులు ఉదయం, రాత్రి వేళల్లో భిక్ష, మధ్యాహ్నంవేళ చద్ది చేస్తోన్నారు. అయ్యప్ప దీక్షా పరుల అన్నదాన కార్యక్రమానికి స్థానిక దాతలతో పాటు నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్ తన వంతు సహాయ సహకారాలు అందిస్తోన్నారు. అన్నదానానికి సంబంధించి అవసరమైన బియ్యం, కూరగాయలను అందిస్తున్నారు.