News8th Jul 06:12 PMSunil Byrisetty1 min read
భూమి సమీపంలోకి ఆస్టరాయిడ్
భూమికి సమీపంలో నుంచి ఒక ఆస్టరాయిడ్ దూసుకెళ్లింది. దాదాపు ఫుట్‌బాల్ మైదానం పరిమాణంలో ఉన్న '2025 ఎన్‌జే' గ్రహశకలం భూకక్షకు దగ్గరగా ప్రయాణించిన ఘటన చోటు చేసుకుంది. 85 అడుగుల వెడల్పుతో
భూమికి సమీపంలో నుంచి ఒక ఆస్టరాయిడ్ దూసుకెళ్లింది. దాదాపు ఫుట్‌బాల్ మైదానం పరిమాణంలో ఉన్న '2025 ఎన్‌జే' గ్రహశకలం భూకక్షకు దగ్గరగా ప్రయాణించిన ఘటన చోటు చేసుకుంది. 85 అడుగుల వెడల్పుతో, గంటకు 48,800 కిమీ వేగంతో ఇది భూ కక్ష్యకు దాదాపు 22.4 లక్షల కిమీ దూరంలోకి వచ్చినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది భూమిని ఢీకొట్టే ప్రమాదం లేకపోయినా, దీని పరిమాణం వల్ల నాసా దీన్ని ప్రమాదకర శ్రేణిలో గుర్తించినట్లు పేర్కొంది. ఇది మళ్లీ 2028లో భూమికి సమీపంలోకి రానుందని చెబుతున్నారు.