News1st Jul 09:33 AMSunil Byrisetty1 min read

బాలికపై అత్యాచారం.. హోటల్ కూల్చివేత

బాలికపై అత్యాచారం చేసిన నిందితుడి హోటల్ ను కుప్పకూల్చారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్ల మోటు గ్రామంలో మైనర్ బాలికపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆగ్రహించిన గుర్తు

బాలికపై అత్యాచారం.. హోటల్ కూల్చివేత
బాలికపై అత్యాచారం చేసిన నిందితుడి హోటల్ ను కుప్పకూల్చారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్ల మోటు గ్రామంలో మైనర్ బాలికపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆగ్రహించిన గుర్తు తెలియని వ్యక్తులు నిందితుడి హోటల్ ని అర్ధరాత్రి సమయంలో కూల్చివేశారు. చంద్రశేఖర్ అనే వ్యక్తి బాలికపై అత్యాచారం చేయడంతో పోలీసులు నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. అత్యాచారానికి సహకరించిన మరో ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. నిందితుడు తనకు గత ప్రభుత్వానికి చెందిన ఓ రాజకీయ నాయకుడి అండదండలు ఉన్నాయని బెదిరించినట్లుగా బాధితులు వాపోతున్నారు. దీంతో ఆ నిందితుడి హోటల్ ను గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేశారు. దీనిపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Andhra Pradesh news
Prakasam district
komarolu
rape case
hotel
చంద్రశేఖర్ అనే వ్యక్తి బాలికపై అత్యాచారం
నిందితుడి పై పోలీసులు ఫోక్సో కేసు నమోదు
Scroll for the next article