News11th Aug 01:48 PMSunil Byrisetty1 min read

అమరావతి నిర్మాణంలో కొత్త అధ్యాయం

అమరావతి నిర్మాణంలో కొత్త అధ్యాయం ఆవిష్కృతం కానుంది. ప్రజా రాజధానిలో ప్రారంభోత్సవాల సందడి నెలకొంది. ఈ నెల 13న ఒకేరోజు మూడు కీలక ఘట్టాలు ప్రారంభం జరుపుకోనున్నాయి. సీడ్ యాక్సిస్ రోడ్,

అమరావతి నిర్మాణంలో కొత్త అధ్యాయం
అమరావతి నిర్మాణంలో కొత్త అధ్యాయం ఆవిష్కృతం కానుంది. ప్రజా రాజధానిలో ప్రారంభోత్సవాల సందడి నెలకొంది. ఈ నెల 13న ఒకేరోజు మూడు కీలక ఘట్టాలు ప్రారంభం జరుపుకోనున్నాయి. సీడ్ యాక్సిస్ రోడ్, ప్రారంభానికి సిద్ధమైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి. రాజధాని అమరావతిలో అత్యాధునిక వసతులతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల నిర్మాణం పూర్తయింది. అమరావతికి రాజమార్గంగా సీడ్ యాక్సిస్ రోడ్ ఉండనుంది. 10.48 ఎకరాల్లో 14.46 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 12 అపార్ట్‌మెంట్ టవర్లను ప్రభుత్వం నిర్మించింది. 288 మంది ప్రజాప్రతినిధులు నివసించేలా టవర్లు రూపుదిద్దుకున్నాయి. 10.84 లక్షల చదరపు అడుగుల బిల్డప్ ఏరియాలో 6 ఎమ్మెల్యే క్వార్టర్స్, 3 ఎమ్మెల్సీ క్వార్టర్స్ సిద్ధమై 216 ఫ్లాట్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఒక్కో అంతస్తులో ఇద్దరు ప్రజాప్రతినిధులు నివసించేలా డిజైన్ చేశారు.
Andhra Pradesh
Amaravati
Amaravati Capital
Amaravati Development
AP Capital
Seed Access Road
MLA Quarters
MLC Quarters
రాజధాని అభివృద్ధి
మౌలిక వసతులు
పట్టణాభివృద్ధి
ఏపీ ప్రభుత్వం
రాజధాని నిర్మాణం
ప్రజా రాజధాని
Scroll for the next article