News17th Dec 04:46 PMSunil Byrisetty1 min read

పర్యాటక రంగంలో సరికొత్త అధ్యాయం

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని దేశీయంగా అగ్రస్థానంలో నిలబెట్టే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా (ADTOI) సహకారంతో 2026

పర్యాటక రంగంలో సరికొత్త అధ్యాయం
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని దేశీయంగా అగ్రస్థానంలో నిలబెట్టే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా (ADTOI) సహకారంతో 2026 ఫిబ్రవరి 13, 14 తేదీల్లో విశాఖపట్నం వేదికగా 'ఏడీటీవోఐ నేషనల్ టూరిజం మార్ట్ 2025' నిర్వహించనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. బుధవారం వెలగపూడి సచివాలయంలో మంత్రి కందుల దుర్గేష్, పర్యాటక శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో ఏడీటీవోఐ ప్రతినిధులతో ఎంవోయూ (అవగాహన ఒప్పందం) కుదుర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను దేశీయ పర్యాటక రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఎంవోయూ కుదుర్చుకున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. అద్భుతమైన తీరప్రాంతం, మెరుగైన మౌలిక వసతులు కలిగిన విశాఖ నగరం ఈ జాతీయ స్థాయి ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమన్నారు. రాష్ట్రంలోని కోస్టల్ టూరిజం, ఆధ్యాత్మిక క్షేత్రాలు, చారిత్రక కట్టడాలు, ఎకో-అడ్వెంచర్ టూరిజం, ఏజెన్సీ ప్రాంతాల పర్యాటకాన్ని జాతీయ స్థాయిలో ప్రదర్శించడానికి ఇది ఒక గొప్ప వేదికని పేర్కొన్నారు.రెండు రోజుల పాటు జరిగే ఈ మార్ట్‌లో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ టూర్ ఆపరేటర్లు, హోటల్ యజమానులు, డెస్టినేషన్ ప్రమోటర్లు, పర్యాటక రంగ వాటాదారులు, ట్రావెల్ నిపుణులు పాల్గొంటారని తెలిపారు.
Andhra Pradesh Tourism
ADTOI National Tourism Mart
Visakhapatnam
Tourism Development
Domestic Tourism
కోస్టల్ టూరిజం
ఆధ్యాత్మిక పర్యాటకం
ఎకో టూరిజం
అడ్వెంచర్ టూరిజం
ఇన్క్రెడిబుల్
Scroll for the next article