News10th Jan 03:29 PMSunil Byrisetty1 min read

జల వివాదాలకు ఇలా చేస్తే పరిష్కారం!

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు చెక్ చెప్పేందుకు ఇరువురు ముఖ్యమంత్రులు కలిసి కూర్చోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల నీటి వనరుల నిర్వహణపై ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి గొంతు కల

జల వివాదాలకు ఇలా చేస్తే పరిష్కారం!
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు చెక్ చెప్పేందుకు ఇరువురు ముఖ్యమంత్రులు కలిసి కూర్చోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల నీటి వనరుల నిర్వహణపై ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి గొంతు కలపడం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పరిణామంగా చెప్పవచ్చు. ప్రాజెక్టుల అనుమతులు, నీటి తరలింపుపై ఇద్దరు నేతలు ఒకేసారి సానుకూలంగా స్పందించడం యాదృచ్ఛికమే అయినా, అది రెండు రాష్ట్రాల రైతులకు మేలు చేసే ఒక గొప్ప సంకేతం. రాజకీయ లబ్ధి కంటే ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రకటించడం జల రాజకీయాలకు చెక్ పెట్టే దిశగా పడిన తొలి అడుగు. కానీ ఇది ప్రకటనలతో సరి పెడితే ప్రయోజనం ఉండదు. ప్రస్తుత తరుణంలో ఒకరి ప్రాజెక్టులను మరొకరు అడ్డుకోవడం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి వంటి ప్రాజెక్టులకు ఏపీ సహకారం, అలాగే ఏపీ చేపట్టే ప్రాజెక్టుల పట్ల తెలంగాణ సానుకూలత ఇప్పుడు అత్యవసరం. కనుక వివాదాలు వద్దు.. పరిష్కారాలే ముద్దు అన్న రేవంత్ రెడ్డి పిలుపునకు, సముద్రంలో వృధాగా పోయే నీటిని వాడుకోవడంలో తప్పులేదు అన్న చంద్రబాబు వ్యాఖ్యలు తోడైతే జల వివాదాలకు పరిష్కారం లభిస్తుంది.
Andhra Pradesh
Telangana
Water Disputes
Chandrababu Naidu
Revanth Reddy
Inter-State Relations
Irrigation Projects
సాగునీటి ప్రాజెక్టులు
రైతుల ప్రయోజనం
తెలుగు రాష్ట్రాల రాజకీయాలు
Scroll for the next article